ikon నారసింహ విజయం

1.0.0 by Fani Kiran Vulapalli


Aug 29, 2016

Tentang నారసింహ విజయం

Indonesia

keberhasilan Narasimha

పోతన రచన

బమ్మెర పోతనామాత్యులు సహజకవి, కవిత్వసామ్రాజ్య పట్టాభిషిక్తుడు. ప్రజాకవి. పరమ భాగవతుడు, భక్తాగ్రేసరుడు. అంతే కాదు నాదోపాసకుడు. నాద మాధుర్య సంకలిత సుందర శబ్దవిన్యాసభూయిష్ఠ వాగ్విశేషములతో పండించిన మహానుభావుడు. పండితులు చెప్పినది, తానాకళింపుజేసుకున్నది, తనకు కానవచ్చినది, తను జెప్పగలిగినది మాత్రం చెప్తాను అని సవినయంగా సరస గంభీరంగా చెప్పుట పోతన్నకే చెల్లింది. అంతటి పోతరాజు కలంనుంచి జాలువారిని మహాద్భుత భక్తిరసపూర్ణ ప్రహ్లాద చరిత్ర,, నరసింహావతార, హిరణ్యకశిపు వృత్తాంతాలు భాగవతంలోనే కాదు తెలుగు సాహితీ విశ్వంలోనే చెప్పుకోదగ్గవి. మరువరాని పోతన భాగవతం అనగానే ముఖ్యంగా గుర్తువచ్చేవి అద్భుతమైన పద్యాలు ఈ స్కంధంలో ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు:

చదువనివాఁ డజ్ఞుం డగు

జదివిన సదసద్వివేక చతురత గలుగుం

జదువఁగ వలయును జనులకుఁ

జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!

ఈ స్కంధంలోని సీస పద్యాలు. వీటికి వేరే వివరించవలసిన పనిలేదు. ఈ స్కంధం చూడగానే సీసం చెప్పాలంటే పోతనే చెప్పాలని అనిపించక మానదు.

మందారమకరందమాధుర్యమునఁ దేలు; మధుపంబుబోవునే మదనములకు?

నిర్మల మందాకినీవీచికలఁ దూఁగు; రాయంచ జనునె తరంగిణులకు?

లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ?

బూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరక; మరుగునే సాంద్రనీహారములకు?

నంబుజోదర దివ్యపాదారవింద

చింతనామృతపానవిశేషమత్త

చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?

వినుతగుణశీల! మాటలు వేయునేల?

మరి కందపద్యం అందాన్ని బహుచక్కగా చూపించాలి అంటే మన బమ్మెర వారే చూపాలి. అందుకే అమృతగుళికలు అంటే యివే అని పండితుల నుండి పామరుల వరకు సర్వులు అంటారు.

ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

నరమూర్తిగాదు కేవల

హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే

సరియాకారము నున్నది

హరిమాయారచిత మగు యథార్థము చూడన్.

భాగవత అవతరణ

మన దౌర్భాగ్యమెట్టిదో కాని ముందునుంచి మన కవుల కాలాదులు, వంశాదులు అందుబాటులో లేవు. మన పోతన్న విషయం కూడ అంతే. కాని పోతన భాగవతం మిక్కిలితర ప్రజాభిమానం సంతరించుకున్నది కనుక తెలుగు ప్రజల నాలుకలపై ఎన్నో కథలు ప్రాచుర్యం పొందాయి. వానిలో ఒకటి.

ఒకప్పుడు వ్యాసులవారు కాశీకి పోయి, పరమేశ్వరుని భాగవతం ప్రజలకు మరింత చేరు వగుటకు సంస్కృత మంత సారవంత మైన భాషను కవిని యిమ్మని ప్రార్థించెనట. శంకరుడు పోతనగా పుట్టి తెలుగు భాషలో చెప్తాడు అని వరమిచ్చాడట. వాయుదేవుడు వెళ్ళి ఇంద్రునికి యిది చెప్పాడట. యింద్రుడు “దేవభాష సంస్కృతం మాత్రమే. తత్వం చెడకుండ భాగవతాన్ని ఏ యితర భాషలోనైన చెప్పబడితే ఆ భాషకు మూడు జన్మల పాటు దాసోహ మంటాను” అన్నాడట. పిమ్మట పోతన రచించబోతున్నా డని తెలిసి, ఎలాగైనా ఆపాలని సింగభూపాలునిగా జన్మంచి అమ్మహాగ్రంధాన్ని పాతిపెట్టించేడు. అంతట రాముడు కలలో శిక్షించగా, ఆమ్మహాగ్రంధాన్ని వెలికి తీయించి, క్రిమిదష్టమైన భాగాలను పూరింపజేసి, పోతనభాగవతానికి తెలుగు భాషకు దాసోహ మ్మని సేవజేసెను. అటుపిమ్మట శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథరాయలుగా రెండు, మూడు జన్మలలో పుట్టి దేవేంద్రుడు ఆంధ్రభాషకు సేవ చేసెను అంటారు. శైవమతావలంబకులైన బమ్మెర కుటుంబంలో పుట్టిన ఆ పోతన ఒకమారు గంగ ఒడ్డున ధ్యానంలో కూర్చుంటే, శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్కరించి, భాగవతాన్ని తెలుగులో చేయమని ఆజ్ఞాపించారుట. ఆంధ్రుల అదృష్ఠం అది. అలా తెలుగులో భాగవత పురాణం అవతరించింది

నారసింహ విజయం ఆవిష్కరణ

ఇలాంటి మహా భాగవత పురాణంలోని భక్తపోషకుడైన నరసింహస్వామి విజయాన్ని చరవాణి, టాబులలో అందించాలనే సంకల్పం అనుకోకుండా జరిగింది. . ఢిల్లీ తెలుగు అకాడమీ కార్యదర్శి శ్రీ నేమాని నాగరాజుగారు (2016లో) దుర్ముఖినామ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో మన తెలుగుభాగవతం.ఆర్గ్ ను పరిచయం చేయటానికి అవకాశం ఇచ్చారు. అది కూడా బాలాజీ దేవాలయం, ఢిల్లీ ప్రాంగణంలో లక్ష్మీనరసింహ కల్యాణోత్సవంలో. ఆ క్షణంలో ఇది చేయా లనిపించింది. ఇదిగో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది "నారసింహ విజయం". హాయిగా ఆస్వాదిస్తూ ఉండండి. మీకు మీ కుటుంబ పరివారాలకు లక్షీనారసింహుని అనుగ్రహం నిరంతంరం అందుతుండు గాక.

- ఫణి కిరణ్

Apa yang baru dalam versi terbaru 1.0.0

Last updated on Aug 29, 2016

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Terjemahan Memuat...

Informasi APL tambahan

Versi Terbaru

Permintaan నారసింహ విజయం Update 1.0.0

Diunggah oleh

Amel Amel

Perlu Android versi

Android 4.0+

Tampilkan Selengkapnya

నారసింహ విజయం Tangkapan layar

Komentar Loading...
Bahasa
Cari...
Berlangganan APKPure
Jadilah yang pertama mendapatkan akses ke rilis awal, berita, dan panduan dari game dan aplikasi Android terbaik.
Tidak, terima kasih
Mendaftar
Berlangganan dengan sukses!
Anda sekarang berlangganan APKPure.
Berlangganan APKPure
Jadilah yang pertama mendapatkan akses ke rilis awal, berita, dan panduan dari game dan aplikasi Android terbaik.
Tidak, terima kasih
Mendaftar
Kesuksesan!
Anda sekarang berlangganan buletin kami.